Nandamuri Balakrishna : టీడీపీలో బాలయ్య తాండవం.. ప్రత్యర్థులకు మామూలుగా లేదుగా?

నందమూరి బాలకృష్ణ కేవలం సినిమాల్లోనే కాదు .. రాజకీయాలనూ ఒక ఊపు ఊపుతున్నాడు

Update: 2025-11-22 07:11 GMT

నందమూరి బాలకృష్ణ కేవలం సినిమాల్లోనే కాదు .. రాజకీయాలనూ ఒక ఊపు ఊపుతున్నాడు. ఎందుకో ఏమో తెలియదు కాని.. నందమూరి బాలకృష్ణ గతం కంటే రాజకీయాల్లో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గతంలో రాజకీయాలను పెద్దగా పట్టించుకోని బాలయ్య బాబు ఈసారి మాత్రం తన విషయంలో ఎవరు అడ్డుతగిలినా, తనకు ఇబ్బంది అనిపించినా తాండవం ఆడేస్తున్నాడు. అఖండ 2 మూవీ ఏపీ పాలిటిక్స్ లో చూపించేస్తున్నాడు.బాలయ్య వైఖరిలో ఈ మార్పునకు కారణమేంటన్న దానిపై తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. సాధారణంగా నందమూరి బాలకృష్ణ సినిమాల విషయంలో ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటారు. అభిమానులను కొట్టడమో.. మరొకటో చేసి వార్తలకు ఎక్కుతారు.

అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు...
కానీ ఈసారి డిఫరెంట్ గా రాజకీయాల్లో ఆయన వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇటీవల శాసనసభలో జరిగిన అంశాన్ని కూడా అలాగే చూడాలి. జగన్ ను తిట్టాలనుకుంటే తిట్టొచ్చు. కానీ అందులో చిరంజీవిని కూడా లాగి ఒకింత రాజకీయంగా నందమూరి బాలకృష్ణ ఫైర్ బ్రాండ్ అని పించుకున్నాడు. ఇక అదే సమయంలో దీనిపై ఎవరు ఎంత రచ్చ చేసినా ఆయన నోటి నుంచి ఎటువంటి క్షమాపణ అన్న పదం రాలేదు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ దటీజ్ బాలయ్య అంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. అసెంబ్లీ రికార్డుల నుంచి బాలయ్య వ్యాఖ్యలను తొలగించినా.. అది కామినేని శ్రీనివాస్ వినతి మేరకే జరిగింది. అసలేం జరగనట్లు నందమూరి బాలకృష్ణ వ్యవహరించడం కూడా ఆయన ప్రత్యర్థులకు ఎక్కడో కాలినట్లుంది.
హిందూపురంలో వైసీపీ...
ఇక తాజాగా హిందూపురంలో అక్కడి వైసీపీ ఇన్ ఛార్జి భర్త వేణురెడ్డి నందమూరి బాలకృష్ణ పై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా అభిమానుల్లో హీట్ ను పెంచేలా చేశాయి. హైదరాబాద్ లో ఉండేవారి కింద పనిచేస్తామా? బానిస బతుకులు ఎందుకు? అని వేణురెడ్డి చేసిన వ్యాఖ్యలతో నందమూరి బాలకృష్ణ అక్కడ పర్యటిస్తుండగానే హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడులు జరిగాయి.ఫర్నీచర్ ను అద్దాలను ధ్వంసం చేశారు. బాలయ్య ఈ విషయంలోనూ ఎలాంటి స్పందనను బయట పడకుండా ప్రత్యర్థులకు తన పవర్ ఏంటో చూపించాడంటూ బాలయ్యఫ్యాన్స్ తెగ ఖుషీ ఫీలవుతున్నారు. మొత్తం మీద టీడీపీకి నందమూరి బాలకృష్ణ వ్యవహారం కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ బాలయ్య తాండవం మాత్రం పొలిటికల్ హీట్ ను ఏపీలో పెంచుతుంది.


Tags:    

Similar News