Alliance in Andhra Pradesh : బాలయ్య, పవన్ మధ్య మరో వివాదం నడుస్తుందా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణల మధ్య మరో వివాదం తలెత్తినట్లు కనిపిస్తుంది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణల మధ్య మరో వివాదం తలెత్తినట్లు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి విషయంలో మళ్లీ మెలిక పడినట్లే కనిపిస్తుంది. టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రిగా జనసేన నేత కందుల దుర్గేష్ ఉన్నారు. అందులోనూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా రంగానికి చెందిన వారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలవుతున్నప్పటికీ ఇప్పటి వరకూ ఫిలిం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఎవరినీ నియమించకపోవం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇది ఇద్దరి మధ్య నెలకొన్న వివాదమే కారణమని తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నామినేటెడ్ పదవిని హోల్డ్ లో పెట్టినట్లు పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.
ఫిలిం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి విషయంలో...
అయితే పార్టీ వర్గాలు అనుకుంటున్నట్లు మరోసారి ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి విషయంలో పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణల మధ్య విభేదాలు తలె్తాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి పవన్ కల్యాణ్ పేరును ఎప్పుడో ఖరారు చేశారు. బహిరంగంగా కూడా చెప్పారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా అవుతారని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. పవన్ కల్యాణ్ ప్రకటన తర్వాత అది కార్యరూపం దాల్చకపోవడానికి నందమూరి బాలకృష్ణ మెలిక పెట్టడమే కారణమన్న వార్తలు పార్టీ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నియామకంలో ఆచితూచి వ్యవహారించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
బాలకృష్ణ వ్యతిరేకించడంతో...
నిర్మాత ఎ.ఎం రత్నం పేరును నందమూరి బాలకృష్ణ వ్యతిరేకించినట్లు తెలిసింది. అదే సమయంలో తాను ఒక పేరును అధినాయకత్వం ముందుంచినట్లు సమాచారం. అయితే పవన్ కల్యాణ్ కు చెందిన జనసేన పార్టీ నేత సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నియామకం జరగకపోవడం ఈ ఊహాగానాలను బలపరుస్తున్నాయి. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ కూడా ఇటీవల అసెంబ్లీలో ఫ్రస్టేషన్ కు లోనయింది అందుకేనంటున్నారు. అదే సమయంలో ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో లూలూ గ్రూపు విషయంలో తన అభ్యంతరాలను పవన్ కల్యాణ్ కుండ బద్దలు కొట్టినట్లు తెలిసింది. దీంతో ఇటు పవన్ కల్యాణ్, అటు నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలెప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నియామకం విషయంలో పట్టుబట్టడం వల్లనే నియామకం ఇప్పటి వరకూ జరగలేదంటున్నారు. విజయవాడ దుర్గ గుడి దేవస్థానం కమిటీ ఛైర్మన్ పదవిని తన మనిషికే ఇప్పించుకోవడంలో నందమూరి బాలకృష్ణ సక్సెస్ అయ్యార. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.