Nandamuri Bala Krishna : బాలయ్య ససేమిరా.. తప్పనిసరి స్థితిలో నష్ట నివారణ

హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాను చేసిన వ్యాఖ్యలను సాధారణ కామెంట్స్ గానే తీసుకున్నారు.

Update: 2025-09-29 06:33 GMT

హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాను చేసిన వ్యాఖ్యలను సాధారణ కామెంట్స్ గానే తీసుకున్నారు. పైగా తాను అన్నదాంట్లో తప్పేముందని ప్రశ్నించినట్లు తెలిసింది. తాను ఉన్న మాటలే మాట్లాడానని, అక్కడ జరిగిన విషయాన్ని కొందరు సభ్యులు సభతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటే తాను ఉండబట్టలేక నిజం చెప్పాల్సి వస్తుందని టీడీపీ నాయకత్వం ముందు తన వాదనను వినిపించినట్లు సమాచారం. వాస్తవానికిశాసనసభలో బాలయ్యచేతనే తాను చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారని తెలిసింది. అయితే అందుకు బాలకృష్ణ అంగీకరించలేదని పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.

అందుకే కామినేని చేత...
అందుకే ఇక కామినేని శ్రీనివాస్ చేత శాసనసభలో జీరో అవర్ లో ఇటీవల తన సభలో ప్రస్తావించిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటీ స్పీకర్ ను కోరారు. తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి కనుక ఆ వ్యాఖ్యల సందర్భంగా జరిగిన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించాలని టీడీపీ నాయకత్వం కామినేని శ్రీనివాస్ చేత చెప్పించినట్లు తెలిసింది. దీంతో కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తితో సభలో చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించారు. మొత్తం సినీరంగంపై చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారు. రికార్డుల నుంచి సినీరంగంపై వ్యాఖ్యల తొలగింపును జనసేన పార్టీ కూడా స్వాగతించడం విశేషం. అంటే బాలకృష్ణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.
చంద్రబాబు ప్రకటన కూడా...
మరొకవైపు సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా నందమూరి బాలకృష్ణ ఎవరినీ అవమానించలేదని అన్నారు. గత ప్రభుత్వంలో నలిగిన ప్రతి సినిమా వాడి కోసం ఆయన గళమెత్తారన్నారు. ఆ ఆవేశం ఎవరిమీద కాదు.. టాలీవుడ్ గౌరవం కోసమేనని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి బాలకృష్ణను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలు అప్పటికే రాజకీయదుమారం కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటనచేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఒక టీమ్ అని, టీమ్‌లో ఏ ఒక్కరు తప్పు చేసినా చాలా నష్టం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యేలు పర్సనల్ అజెండాలు పెట్టుకుని మాట్లాడితే మన లక్ష్యానికి విఘాతం కలుగుతుందని అన్నారు. నందమూరి బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోబోనని చెప్పడంతోనే కామినేనిని సహకారంతో ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. తాను కూడా సభలో అందరితో పాటు బాలకృష్ణకు కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లయిందని అంటున్నారు.


Tags:    

Similar News