Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రగిలిపోవడం వెనక ఇంత స్టోరీ ఉందా?
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏదో కొంత ఫ్రస్టేషన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏదో కొంత ఫ్రస్టేషన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఆయన సినీ ఇండ్రస్ట్రీలో తనకంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని ఆయన కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం చాలా తక్కువ. ఆయనకు రాజకీయాలకంటే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే గత కొద్ది రోజుల నుంచి నందమూరి బాలకృష్ణ శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారు. ఆయనలో ఉన్న కోపాన్ని సమావేశాల్లో వెళ్లగక్కారు. తనలో దాచిపెట్టుకున్న అసహనాన్ని సభలో వెళ్లగక్కేందుకు బాలకృష్ణ ఏమాత్రం వెనకాడ లేదు.
సూటిగా మాట్లాడతారని....
నిజానికి నందమూరి బాలకృష్ణ ఏదున్నాసూటిగా మాట్లాడతారంటారు. ఆయన అభిమానుల విషయంలోనూ అదే రేంజ్ లో తన అభిమానాన్ని కానీ, తన అసహనాన్నివ్యక్తం చేస్తారు. కొన్నిసార్లు అభిమానులపై చేయి చేసుకుని వివాదలో చిక్కుకున్నారు. అలాంటి నందమూరి బాలకృష్ణ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో చిరంజీవి, జగన్ పై తీవ్ర వ్యాఖ్యలుచేయడం కూడా అదే కారణమని తెలుగుదేశం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే జనసేనకు చెందిన మంత్రి కందుల దుర్గేష్ పై కూడా ఆయన మండిపడ్డారు. అలాగే కామినేని శ్రీనివాస్ తీరుపై కూడా నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ రాజకీయంగా ఎలాంటి పదవి కోరుకోరు. కానీ తనకు ప్రాధాన్యత కోరుకోవడంలో మాత్రం ముందుంటారు.
చిరంజీవిపైనా...
అదే ఈరోజు జరిగింది. శాంతి భద్రతల విషయంలో అసెంబ్లీలో జరిగిన చర్చలో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ ను సినీ ప్రముఖులు కలిసేందుకు వచ్చారని, అయితే అప్పుడు జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో ఇంటికి వచ్చిన సీనీ ప్రముఖులు నాటి సినీ ఫొటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి చెప్పారు. తర్వాత తాను ఇంతమందిని తీసుకు వస్తే ఎందుకు ఆయన కలవడం లేదని గట్టిగా అడిగిన తర్వాత జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారని కామినేని శ్రీనివాస్ తఅన్నారు. దీనికి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కామినేనిశ్రీనివాస్ అసెంబ్లీలో అబద్ధాలు చెబుతున్నారన్నారు. చిరంజీవి గట్టిగా మాట్లాడితే నాడు సైకో జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చారనడం అబద్ధమని తెలిపారు. చిరంజీవి కాదు గదా ఎవరూ అడగలేదని నందమూరి బాలకృష్ణ గట్టిగా అన్నారు.
తొమ్మిదో ప్లేస్ లోనా?
అలాగే ఫిలిం డెవలెప్ మెంట్ కోసం జాబితాను తయారు చేయాలని తనకు ఒక ఆహ్వాన పత్రం వచ్చిందని, అందులో తన పేరును తొమ్మిదో సంఖ్యలో ఉందని నందమూరి బాలకృష్ణ అన్నారు. నా పేరును తొమ్మిదో ప్లేస్ లో చేర్చిందెవరు? మమ్మల్ని గౌరవించరా? అంటూ ప్రస్తుత టూరిజం సినిమా టోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను నేరుగా సభలో ప్రశ్నించారు. బాలయ్య సభలో ఇలా వ్యవహరించడానికి తనలో ఇన్నాళ్లు దాచుకున్న బాధను అసెంబ్లీలో వెళ్లగక్కారన్నారు. తాను పవన్ కల్యాణ్ కంటే రాజకీయంగా, సినీరంగలో సీనియర్ నని నందమూరి బాలకృష్ణ చెప్పీ చెప్పకుండానే సభలో ఉన్న అందరికీ చెప్పే ప్రయత్నం చేశారని సభలో ఉన్న ఎమ్మెల్యేలు చర్చించుకుంటును్నారు.