ఏపీ లిక్కర్ కేసులో బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ
ఏపీ లిక్కర్ కేసులో బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది.
ఏపీ లిక్కర్ కేసులో బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో గత కొద్ది రోజులుగా మిధున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన తనకు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశమిస్తూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటీషన్ వేశారు.
మిధున్ రెడ్డి బెయిల్ పై...
అలాగే రెగ్యులర్ బెయిల్ పిటీషన్ కూడా వేశారు. మరొకవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైనా నేడు ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. నిందితులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపైనా నేడు ఏసీబీ కోర్టు విచారణ జరుపుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఒక్కరికి మాత్రమే బెయిల్లభించింది.