అమరావతిలో ఆవకాయ ఫెస్టివల్
అమరావతిలో పర్యాటక శాఖ 'ఆవకాయ' పేరుతో సరికొత్త ఉత్సవానికి శ్రీకారం చుట్టింది.
అమరావతిలో పర్యాటక శాఖ 'ఆవకాయ' పేరుతో సరికొత్త ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. సినిమా, సంస్కృతి, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ ఫెస్టివల్‌ను జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడ కేంద్రంగా నిర్వహించనున్నారు. తెలుగు నేలపై పుట్టిన కథ, కవిత, సినిమా, సంగీతం, నాటకం వంటి అన్ని కళారూపాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నమే 'ఆవకాయ' అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఈ ఫెస్టివల్ ద్వారా తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు, సమకాలీన సృజనాత్మక ఆలోచనలకు కూడా పెద్దపీట వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి.