తణుకులో టెన్షన్.. టెన్షన్

అమరావతి రైతుల మహా పాదయాత్ర తణుకు నియోజకవర్గంలోకి సమీపిస్తున్న తరుణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది

Update: 2022-10-11 06:19 GMT

అమరావతి రైతుల మహా పాదయాత్ర తణుకు నియోజకవర్గంలోకి సమీపిస్తున్న తరుణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తణుకు ప్రాంతంలో కొందరు వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు చేరి నల్లబెలూన్లు, నల్ల జెండాలతో అమరావతి రైతులకు స్వాగతం పలుకుతున్నారు. మూడు రాజధానులే ముద్దంటూ వారు నినాదాలు చేస్తున్నారు. దీంతో మహాపాదయాత్ర ఆ పరిసర ప్రాంతాలకు చేరుకునే సమయంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

రెండు వర్గాలు...
మరోవైపు రాజధాని రైతులు ఈరోజు పెనుగొండ నుంచి బయలుదేరి తణుకు నియోజకవర్గంలోని వేల్పూరు వరకూ పాదయాత్ర చేస్తారు. మొత్తం 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. రాత్రికి వేల్పూరులో బస చేయనున్నారు. అయితే రెండు వర్గాలు మొహరించడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అమరావతికి రైతులకు మద్దతుగా టీడీపీ, జనసేన కార్యకర్తలు పోటీగా నినాదాలు చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


Tags:    

Similar News