కోనసీమలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు

గోదావరి వరద తీవ్రత ఎక్కువ కావడంతో దాదాపు 18 మండాలల్లోని 54 గ్రామాలు నీట మునిగాయి

Update: 2022-07-14 05:10 GMT

గోదావరి వరద తీవ్రత ఎక్కువ కావడంతో దాదాపు 18 మండాలల్లోని 54 గ్రామాలు నీట మునిగాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఐ. పోలవరం, పైడిపాక, సకినేటిపల్లి, పి. గన్నవరం మండలం బూరుగులంక, అరిగెలవారిపేట, ఉడుముడిలంక, జి.పెదపూడిలంక గ్రామాలు జలదిగ్భంధనంలో చిక్కుకుపోయాయి. వరద ముంపు ప్రాంత గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలు చేపట్టారు. సఖినేటిపల్లిలోని లంకరేవులో చిక్కుకుపోయిన ఆరుగురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు.

వరద తీవ్రత....
ధవళేళ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. నీటిమట్టం 15.50 అడుగులకు చేరింది. 15.64 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరుగుతుంది. 175 గేట్లను ఎత్తివేసి నీటిని వదిలిపెడుతున్నారు. పూర్తి స్థాయిలో వరద ప్రవాహం తగ్గేంత వరకూ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా తెలిపారు.


Tags:    

Similar News