Weather Report : సెగలు కక్కుతుందిగా.. చెమటలు కారిపోతున్నాయిగా?

మే నెల కావడంతో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణలలో వేడిగాలుల తీవ్రత కూడా ఉంటుంది

Update: 2025-05-13 03:50 GMT

మే నెల కావడంతో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడి పోతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. వేడిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది అత్యధికంగా ఆంధ్రరప్రదేశ్ లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మేరకు ప్రజలు ఇళ్లలోనే పరిమితమయితే బాగుంటుందని, బయటకు వస్తే వడదెబ్బ తగులుతుందని హెచ్చరిస్తున్నారు.

విద్యుత్తు వాడకం...
ఇక ఏసీలు, కూలర్లు నిర్విరామంగా నడుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు అనేక జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోవుతుండటంతో పాటు ఉక్కపోతతో విద్యుత్తు వాడకం కూడా విపరీతంగా పెరిగిందని ట్రాన్స్ కో అధికారులు చెబుతున్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని చెబుతున్నారు మరొక వైపు తెలంగాణలో అక్కడక్కడా నాలుగు రోజుల పాటు భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెబుతున్నప్పటికీ చిరుజల్లులతో అక్కడక్కడ పడుతుండటంతో వేడి గాలుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఉష్ణోగ్రతలు కూడా ఏ మాత్రం కనిష్టానికి పడిపోవడం లేదు
వడగాలుల తీవ్రత...
ఆంధ్రప్రదేశ్ లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు అలెర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో వడెబ్బ మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగాలని కూడా సూచిస్తున్నారు. నేడు కూడా ఆంధ్రప్రదేశ్ లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. దీంతో పాటు నేడు రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడతాయాని, పిడుగులు కూడా అక్కడక్కడాపడే అవకాశముందని చెప్పింది.


Tags:    

Similar News