మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్
మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు మచిలీపట్నం న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చందు, శ్రీహర్షలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సాక్షిగా ఉన్నారు. వరసగా వాయిదాలకు న్యాయస్థానానికి హాజరు కాకపోవడంతో మాజీ మంత్రి పేర్ని నానికి మచిలీపట్నం న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
విచారణకు పిలిచినా...
అనేక సార్లు విచారణకు పిలిచినా రాకపోవడంతో ఆయన అరెస్ట్ కు వారెంట్ జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన ఈ కేసు విచారణను వాయిదా వేసింది. అయితే ఈ కేసులో మాజీ మంత్రి పేర్నినానిని కోర్టులో హాజరు పర్చాలని పోలీసులను ఆదేశించింది.