Andhra Pradesh : ఆరోరోజులు.. అందని వైద్యం

ఆంధ్ర ప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచి ఆరురోజులవుతుంది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు

Update: 2025-10-16 07:10 GMT

ఆంధ్ర ప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచి ఆరురోజులవుతుంది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బిల్లు బకాయిల కోసం ప్రయివేటు ఆస్పత్రులుసమ్మెకు దిగాయి. నెట్ వర్క్ ఆస్పత్రులు దీర్ఘ కాలిక చికిత్సలు నిలిపి వేయడంతో పాటు శస్త్ర చికిత్సలు కూడా నిలిపివేయడంతో భక్తులు తీవ్రంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. డయాలిసిస్, కీమో థెరపీ వంటి చికిత్సలు ఆస్పత్రుల యాజమాన్యం నిరాకరిస్తుంది.

డయాలసిస్.. కీమో థెరపీ...
సమ్మె కాలంలో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగవని ప్రైవేట్ అసుపత్రులు స్పష్టం చేస్తుండటంతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతున్నారు. షెడ్యూల్ ప్రకారం చేయాల్సిన డయాలిసిస్, కీమో థెరపీలు చేయమని నెట్ వర్క్ ఆస్పత్రులు తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వం నుంచి బకాయిలు విడుదల అయ్యే వరకు చికిత్సలు చేయలేమంటున్నాయి. దీంతో దీర్ఘ కాలిక వ్యాధులకు చికిత్సలు పొందుతున్న రోగులు ఆందోళనకు గురవుతున్నారు. అత్యవసర వైద్య సేవలు నిలిపి వేయడంతో రోగులకు ఇక్కట్లకు గురవుతున్నారు.


Tags:    

Similar News