Ap High Court : ప్రభుత్వ పధకాలపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
ప్రభుత్వ పథకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది
andhra pradesh high court
ప్రభుత్వ పథకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రస్తుతం ఎలాంటి పథకాలను లబ్దిదారులకు అందచేయకూడదని ఎన్నికల కమిషన్ తరుపున న్యాయవాదులు వాదించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా లబ్దిదారులను ప్రలోభపెట్టేలా నగదును ఎన్నికల సమయంలో డీబీటీ ద్వారా బదిలీ చేయడం సరైన పద్ధతి కాదని కూడా వాదించింది.
కొనసాగుతున్న పథకాలను...
అయితే ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను ఎన్నికల కోడ్ పేరుతో ఎలా ఆపుతారని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు ప్రశ్నించారు. కొనసాగుతున్న పథకాలను కంటిన్యూ చేయడం సంప్రదాయంగా వస్తుందని తెలిపారు. గతంలోనూ అనేక రాష్ట్రాల్లో ఇలా కొనసాగుతున్న పథకాలకు అనుమతిచ్చిన విషయాన్ని ప్రభుత్వ తరుపున న్యాయవాదులు గుర్తు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.