APSRTC : సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీకి వచ్చిన ఆదాయం ఎంతో తెలుస్తే షాక్ అవుతారంతే
సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిసింది. భారీ ఆదాయం సమకూరింది.
సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిసింది. భారీ ఆదాయం సమకూరింది. మొత్తం 23 కోట్ల రూపాయలను సంక్రాంతి పది రోజుల్లో ఆర్జించినట్లయింది. సంక్రాంతికి వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు అనేక మంది ప్రజలు తరలి వచ్చారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే వచ్చారు. ముందుగా రానుపోను రిజర్వేషన్ చేసుకున్న వారికి పది శాతం రాయితీ కూడా ఏపీ ఎస్ ఆర్టీసీ ఇచ్చింది.
ఎక్కువ మంది రాను పోను...
దీంతో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి తమ స్వగ్రామాలకు చేరుకుని తిరిగి పండగ ముగించుకుని వారు నివాసం ఉండే ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల ద్వారానే చేరుకున్నారు. 7,200 బస్సు సర్వీసులతో సంక్రాంతికి బస్సులను నడిపడం ప్రారంభించిన ఏపీఎస్ ఆర్టీసీ 9,097 బస్సులను నడపటంతో ఇంతటి భారీ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించగలిగింది.