తెలంగాణ నుంచి ఏపీకి స్పెషల్ బస్సులు..

ఏపీఎస్ ఆర్టీసీ కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూనే.. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కృష్ణా రీజియన్‌ నుంచి 1,266 ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Update: 2021-12-23 05:06 GMT

తెలుగు వారికి అతిపెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండుగే. ఎక్కడెక్కడో ఉన్నవారంతా పండుగ సమయానికి సొంత ఊళ్లకు చేరుకుంటారు. పెద్దలు, పిల్లలంతా ఒకేచోట ఉండి నాలుగురోజుల పాటు చేసుకునే పెద్ద పండుగ. కానీ.. సొంతఊరు వెళ్లాలనుకునే వారికి ప్రయాణాల్లో అనేక ఇబ్బందులు తలెత్తుతుంటాయి. బస్సులు, రైళ్లలో తీవ్ర రద్దీ ఏర్పడుతుంది. బస్సుల సంగతి పక్కన పెడితే.. రైళ్లలో ప్రయాణించేవారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనరల్ బోగీలతో పాటు రిజర్వేషన్ల బోగీల్లో కూడా ఖాళీ ఉండదు సరికదా.. రైలు పైకి ఎక్కి ప్రయాణం చేసేవారు కోకొల్లలు.

ఇప్పటికే సంక్రాంతి కోసం జనవరి 7వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకూ ఉన్న రైళ్లు, బస్సులన్నీ ముందస్తు రిజర్వేషన్లతో ఫుల్ అయిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఇలా కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్రవైపు వెళ్లే బస్సులు, రైళ్ల రిజర్వేషన్లీ నిండుకున్నాయి. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూనే.. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కృష్ణా రీజియన్‌ నుంచి 1,266 ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌కు 362, విశాఖపట్నానికి 390, రాజమండ్రికి 360,చెన్నైకి 20, బెంగళూరుకు 14, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 120 బస్సులను నడపనున్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి.. రిజర్వేషన్లు చేసుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది.




Tags:    

Similar News