Ys Jagan : జగన్ ఫింగర్ లో రింగ్.. ఆశ్యర్యమే గా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేతికి కొత్త రింగ్ కనపడుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Update: 2025-06-19 08:11 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పెద్దగా ఎటువంటి ఆభరణాలు కనిపించవు. ఇప్పటి వరకూ మెడలో బంగారు చైన్ ఉంటుంది. అది ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచే ఉంది. చేతికి ఖరీదైన వాచి ఉంటుంది. సమయం చూసుకునేందుకు వాచీని జగన్ ఉపయోగిస్తారు. అయితే తాజాగా జగన్ చేతికి కొత్త రింగ్ కనపడుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎడమ చేతికి...
ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో జగన్ రింగుతో కనిపించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎడమ చేతి మధ్య వేలికి హెల్త్ ట్రాకర్ రింగ్ పెట్టుకున్నారని చెబుతున్నారు. ప్రతి సమావేశంలోనూ పదేపదే హెల్త్ ట్రాకర్ రింగ్ గురించి చంద్రబాబు ప్రస్తావిస్తారు. తాను ఎంతసేపు నిద్రపోతున్నాననేది తెలుసుకోవడానికి ఈ రింగ్ వాడుతున్నట్లు చంద్రబాబు పలుమార్లు చెబుతుండటంతో ఇప్పుడు చంద్రబాబు మాదిరిగానే జగన్ వేలికి కూడా అలాంటి రింగ్ కనిపించడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ జరగుతుంది.


Tags:    

Similar News