Ys Sharmila : సూపర్ సిక్స్ లో అన్నీ కోతలే

సూపర్ సిక్స్ హామీలకు అన్నింటిలో కోతలేనని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు

Update: 2025-06-28 06:54 GMT

సూపర్ సిక్స్ హామీలకు అన్నింటిలో కోతలేనని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. 43 లక్షల మంది రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారాన్నారు.రాష్ట్రంలో బాబు,జగన్,పవన్ బీజేపీకి తొత్తులేనని, బీజేపీ వ్యతిరేకంగా దత్తపుత్రుడు జగన్ ఒక్క ఉద్యమం కూడా చేయరని అన్నారు. జగన్ తనకు పనికి వచ్చే ఉద్యమాలు మాత్రమే చేస్తారని, కాంగ్రెస్ లో వర్గపోరు అనేది లేదని, సీనియర్లు ఎవరు కూడా దూరం కాలేదని వైఎస్ షర్మిల తెలిపారు.

రైతులకు ద్రోహం...
సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అని వైఎస్ షర్మిల అన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని దుఃఖిభవ చేస్తున్నారని, రాష్ట్రంలో 93 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారని, - అర్హత పేరుతో సగానికి సగం మంది రైతులకు కోత పెట్టారని, 47 లక్షల మందికే పథకం వర్తింప జేస్తారట అంటూ ఎద్దేవా చేశఆరు. ఇది 43 లక్షల మంది మిగతా రైతులకు చేస్తున్న అన్యాయం కాదా? అని ప్రశ్నించారు.


Tags:    

Similar News