తోతాపురి రైతులవి తరగని కష్టాలు : వైఎస్ షర్మిల

తోతాపురి రైతులవి తరగని కష్టాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు.

Update: 2025-07-10 06:12 GMT

తోతాపురి రైతులవి తరగని కష్టాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ధరల పతనంతో రైతుకు తోతాపురి చేదు అయిందన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ధర లేక రైతు విలవిలలాడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకునే పాపాన పోలేదన్న షర్మిల మద్దతు ధర అందించి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు. పదహారు రూపాయలు ధర కడితే తప్ప కోలుకోలేమని రైతులు చెప్తుంటే, నాలుగు రూపాయల కన్నా ఎక్కువ కొనడం లేదని మొత్తుకుంటుంటే, పన్నెండు రూపాయలు అందించి న్యాయం చేశామని అబద్ధాలు చెప్పడం సరికాదని వైఎస్ షర్మిల అన్నారు.

ఇద్దరి మధ్య...
తక్షణం తోతాపురి రైతుల కష్టాలపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని, నువ్వు కొట్టినట్లు చెయ్యి, నేను ఏడ్చినట్లు చేస్తా.. ఇదే కూటమి, వైసీపీ మధ్య నడుస్తున్న యవ్వారమని అన్నారు. పైకి 500 మందితో అనుమతి ఇస్తారని, 10 వేల మందితో వచ్చినా సహకరిస్తారని, పరామర్శల పేరుతో దగ్గరుండి బలప్రదర్శనలు చేయిస్తారని, కళ్ల ముందే జన సమీకరణ జరుగుతున్నా ప్రేక్షక పాత్ర పోషిస్తారని షర్మిల ఫైర్ అయ్యారు. కూటమి వారి ప్రొడక్షన్ లో, పోలీసు శాఖ సెట్టింగ్ లో, బంగారుపాళ్యం వైసీపీ మామిడికాయ సినిమాను రక్తి కట్టించారన్నారు.


Tags:    

Similar News