నేడు కర్నూలులో వైఎస్ షర్మిల పర్యటన
నేడు కర్నూలులో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు
నేడు కర్నూలులో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై వైఎస్ షర్మిల చర్చించనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రతిపక్షం ప్రజల పక్షాన నిలబడకుండా సొంత ప్రయోజనాల కోసం పాటుపడుతుందని ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేయనున్నారు.
రేపు నంద్యాలకు...
మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు సమయం ఉండటంతో పార్టీ బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. నేతలు జనంలో తిరుగుతూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. రేపు నంద్యాల జిల్లాలో వైఎఎస్ షర్మిల పర్యటించనున్నారు.