మావోయిస్టులు ఏపీకి ఎందుకు వచ్చారంటే?

మారేడుమల్లిలో మరో ఎన్ కౌంటర్ జరిగిందని ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు

Update: 2025-11-19 04:06 GMT

ఛత్తీస్‌గఢ్‌ లేదా తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని ఏపీ ఇంటలిజెన్స్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. పటిష్ట నిఘా ఏర్పాటుచేసి కదలికలను గమనిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అరెస్టులు జరిగాయన్నారు. స్పెషల్‌ జోనల్‌ కమిటీ మెంబర్లు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్న ఆయన ప్లాటూన్‌ మెంబర్లు 23 మందిని అదుపులోకి తీసుకున్నామని మహేష్ చంద్ర లడ్డా చెప్పారు . ఇప్పటివరకు మొత్తం 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

నేడు మరో ఎన్ కౌంటర్...
దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిన్నటి తనిఖీల్లో భారీగా ఆయుధ సామగ్రి, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని, అల్లూరి జిల్లాలో మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా మృతి చెందారని మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. నిన్న మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారన్న మహేష్ చంద్ర లడ్డా తప్పించుకున్న మావోయిస్టులను కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయని ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేష్‌చంద్ర లడ్డా పేర్కొన్నారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్‌ జరిగిందని, ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారని మహేష్ చంద్ర లడ్డా తెలిపారు.


Tags:    

Similar News