ఇప్పటం పిటిషనర్లకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పిటిషనర్లకు జరిమానా

ఇళ్ల తొలగింపుపై తమకు షోకాజు నోటీసులు ఇవ్వలేదంటూ వారంతా హైకోర్టును ఆశ్రయించారు. ఆఖరికి షోకాజు నోటీసులు ..

Update: 2022-11-24 10:05 GMT

ఇప్పటం పిటిషనర్లకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు ఎదురుదెబ్బ తగిలింది. పిటిషన్ వేసిన ఒక్కొక్కరికి లచ్చరూపాయల జరిమానా విధించింది. కోర్టుకు తప్పుదోవ పట్టించినందుకు 14 మందికి 14 లచ్చలు జరిమానా విధించింది.

ఇళ్ల తొలగింపుపై తమకు షోకాజు నోటీసులు ఇవ్వలేదంటూ వారంతా హైకోర్టును ఆశ్రయించారు. ఆఖరికి షోకాజు నోటీసులు ఇచ్చారని పిటిషనర్ల తరపు న్యాయవాది హైకోర్టు ముందు అంగీకరించారు. దాంతో వారిపై కోర్టు మండిపడింది. కోర్టును తప్పుదోవ పట్టించి స్టే పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేశారంటూ అసహనం వ్యక్తం చేసింది. పిటిషనర్లు స్వయంగా హాజరై.. తమపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.


Tags:    

Similar News