టీటీడీ కొత్త పాలకమండలి.. ఛాన్స్ దక్కించుకున్న వాళ్లెవరెవరంటే?

తిరుమల ఆలయం ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటంతో పాటు ఆర్థిక పారదర్శకత, సమర్థ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు

Update: 2023-08-26 02:30 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన పాలకమండలిని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిని ప్రకటించారు. టీటీడీ బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), పొన్నాడ సతీష్‌ (ముమ్మిడివరం), తిప్పేస్వామి (మడకశిర)కు అవకాశం కల్పించారు. టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియగా.. ఆయన స్థానంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ నూతన ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇక కొత్తగా ఎన్నికైన పాలక మండలి సభ్యులు తిరుమల ఆలయం ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటంతో పాటు ఆర్థిక పారదర్శకత, సమర్థ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు.

టీటీడీ పాలకమండలి సభ్యులు వీరే..
1) పొన్నాడ వెంకట సతీష్ కుమార్ (ముమ్మిడివరం ఎమ్మెల్యే)
2) సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట ఎమ్మెల్యే)
3) ఎం. తిప్పేస్వామి (మడకశిర ఎమ్మెల్యే)
4) సిద్ధవటం యానాదయ్య (కడప)
5) చండే అశ్వర్థ నాయక్ (అనంతపురం)
6) మేకా శేషుబాబు
7) ఆర్. వెంకట సుబ్బారెడ్డి
8) ఎల్లారెడ్డిగారి సీతారామిరెడ్డి (కర్నూలు, మంత్రాలయం)
9) గడిరాజు వెంకట సుబ్బరాజు (ఉంగుటూరు)
10) పెనక శరత్ చంద్రారెడ్డి (తెలంగాణ)
11) రాంరెడ్డి సాముల
12) బాలసుబ్రమణియన్ పళనిస్వామి
13) ఎస్.ఆర్. విశ్వనాథ్ రెడ్డి
14) జి సీతా రెడ్డి (ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి) (తెలంగాణ)
15) కృష్ణమూర్తి వైద్యనాథన్ (తమిళనాడు)
16) శిద్ధా వీరవెంకట సుధీర్ కుమార్ (శిద్ధా రాఘువులు కుమారుడు) (ప్రకాశం)
17) సుదర్శన్‌ వేణు
18) నెరుసు నాగ సత్యం (ఏలూరు)
19) ఆర్.వి. దేశ్‌పాండే (కర్ణాటక)
20) అమోల్ కాలే (మహారాష్ట్ర)
21) డాక్టర్ ఎస్. శంకర్ (తమిళనాడు)
22) మిలింద్ కేశవ్ నర్వేకర్ (మహారాష్ట్ర)
23) డాక్టర్ కేతన్ దేశాయ్
24) బోర సౌరభ్ (మహారాష్ట్ర)
టీటీడీ పాలకమండలిలో పలువురికి స్థానం ఉంటుందని భావించారు. అయితే వారికి నిరాశనే ఎదురైంది. ఈ సభ్యులందరూ త్వరలో టీటీడీ పాలక మండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.


Similar News