ఆరుగురి ఏపీ యాత్రికుల ఆచూకీ?

అమర్ నాధ్ యాత్రకు వెళ్లి కన్పించకుండా పోయిన వారిని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఏపీ నుంచి వెళ్లిన ఆరుగురు కన్పించడం లేదు.

Update: 2022-07-10 05:41 GMT

అమర్ నాధ్ యాత్రకు వెళ్లి కన్పించకుండా పోయిన వారిని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఆరుగురు ఏపీ నుంచి వెళ్లిన వారు కన్పించడం లేదు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం ధృవీకరించింది. విజయవాడకు చెందిన వినోద్ అశోక్, రాజమండ్రికి చెందిన గునిశెట్టి సుధ, పార్వతి, తిరుపతికి చెందిన మధు, గుంటూరుకు చెందిన మేడూరు ఝాన్సీలక్ష్మి, విజయనగరం కు చెందిన వానపల్లి రవీంద్రకుమార్ లు కన్పించడం లేదని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. వీరి సెల్ ఫోన్లు కూడా స్విచాఫ్ అయినట్లు వస్తుండటంతో వీరి ఆచూకీ కోసం గాలించేందుకు ప్రభుత్వం సిద్దమయింది.

చనిపోయిన వారిలో...
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని తిరిగి సురక్షితంగా ఏపీకి చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏపీ భవన్ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ చర్యలు చేపట్టారు. ఇప్పటికే అధికారులు స్పాట్ కు వెళ్లి ఏపీ యాత్రికులను గుర్తించే పనిలో పడ్డారు. అమర్‌నాథ్ యాత్రలో ఒక్కసారిగా వరద రావడంతో పలువురు చనిపోయిన సంగతి తెలిసిందే. చనిపోయిన వారిలో ఏపీకి చెందిన వారు ఎవరూ లేరని ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్ష్ తెలిపారు.


Tags:    

Similar News