ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ అప్పటి నుంచే..

ఎప్పుడెప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తారా ? ఎప్పుడు అమ్మమ్మ-నానమ్మల ఇళ్లకు వెళ్దామా అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

Update: 2023-04-27 11:42 GMT

summer holidays for ap school students

సమ్మర్ మొదలై రెండు నెలలైంది. అయినా ఇంకా ఏపీలో పాఠశాల విద్యార్థులకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వలేదు. ఎప్పుడెప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తారా ? ఎప్పుడు అమ్మమ్మ-నానమ్మల ఇళ్లకు వెళ్దామా అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఏడాదంతా తరగతులు, హోంవర్కులు, ట్యూషన్లు, పరీక్షలతో అలసిపోయిన పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో పాఠశాలలన్నింటికీ మే 1 నుండి వేసవి సెలవులను ప్రకటిస్తూ పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ 30న ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే సెలవులు మొదలవుతాయి.

అంటే.. మరో రెండ్రోజుల్లో వేసవి సెలవులు మొదలు కానున్నాయి. తిరిగి జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. జూన్‌ మొదటి వారం నుంచే బడిబాట కార్యక్రమాన్ని చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. జూన్‌ 1 నుంచి బడులు తెరుచుకోనుండగా, విద్యా సంవత్సరం మాత్రం 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది మొత్తం 43 రోజులు వేసవి సెలవులు ఇచ్చారు. కాగా.. తెలంగాణలో ఏప్రిల్ 25 నుండే వేసవి సెలవులు ప్రకటించారు. తెలంగాణలో కూడా జూన్‌ 12న బడులు పునఃప్రారంభం అవుతాయి.




Tags:    

Similar News