YCP :తోపుదుర్తి కోసం రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని అరెస్ట్‌ చేయకపపోవడంపై ఏపీ డీజీపీ ఆఫీస్ సీరియస్ అయింది

Update: 2025-05-04 05:29 GMT

వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని అరెస్ట్‌ చేయకపపోవడంపై ఏపీ డీజీపీ ఆఫీస్ సీరియస్ అయింది. అరెస్ట్‌లో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై నివేదిక ఇవ్వాలని సత్యసాయి జిల్లా ఎస్పీని ఆదేశించారు. తోపుదుర్తి ఆచూకీ కోసం రంగంలోకి ప్రత్యేక బృందాలు దిగి వెతుకున్నాయి. విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరుకు పోలీస్ బృందాలు బయలుదేరి వెళ్లాయి.

పదకొండు మంది అరెస్ట్?
మరోవైపు హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ పగిలిపోయిన ఘటనలో 11 మంది వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు వైసీపీ నేతల కోసం పోలీసుల గాలింస్తున్నారు. రామగిరి హెలిప్యాడ్ దగ్గర పోలీసులపై దాడి ఘటనలో అరెస్ట్ చేశఆరు. మొత్తం 11 మంది వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News