అందరూ విధులకు రావాల్సిందే.. ఉన్నతాధికారులకు రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు

వివిధ శాఖ‌ల‌ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శుల‌, ముఖ్య కార్యద‌ర్శులు, కార్యదర్శులంతా సచివాలయం నుంచి విధులకు హాజరు కావాల్సిందిగా

Update: 2022-02-18 11:18 GMT

కరోనా కారణంగా.. ఇప్పటి వరకూ నేరుగా విధులకు హాజరు కాని ఉన్నతాధికారులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై సచివాలయ ఉద్యోగులంతా నేరుగా విధులకు హాజరు కావాల్సిందేనని ఆ ఆదేశాల్లో పేర్కొంది. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ఉన్నతాధికారులు విజయవాడ లోని వివిధ హెచ్ఓడీ కార్యాలయాల నుండి విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గడంతో.. అందరూ సచివాలయ విధులకు హాజరు కావాలని ప్రధాన కార్యదర్శి కీలక ఆదేశాలు జారీ చేశారు.

వివిధ శాఖ‌ల‌ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శుల‌, ముఖ్య కార్యద‌ర్శులు, కార్యదర్శులంతా సచివాలయం నుంచి విధులకు హాజరు కావాల్సిందిగా సీఎస్ స‌మీర్ శ‌ర్మ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఉన్నతాధికారులు కూడా బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్ వేర్ ద్వారా హాజరు నమోదు చేయాల‌ని సీఎస్ ఆదేశించారు. కరోనా తీవ్రత తగ్గడంతో ఏపీ సచివాలయ పరిధిలో కరోనా నిబంధనలను ఎత్తివేసినట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలకు ఇంతకాలం జరిగిన అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్ పేర్కొన్నారు.



Tags:    

Similar News