Sun Feb 01 2026 15:54:23 GMT+0000 (Coordinated Universal Time)
బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా.. మహిళ అరెస్ట్
ఇటీవలే సాధిక్ గంజాయి కేసులో అరెస్ట్ అవ్వగా.. అతడిని విజయవాడ జైలుకు తరలించారు. పోలీసులు సాధిక్ ను విచారణ చేయగా..

బ్యూటీషియన్ ముసుగులో ఓ మహిళ గంజాయి దందా చేస్తుండటం కృష్ణాజిల్లా, గుడ్లవల్లేరులో వెలుగుచూసింది. పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. హలీమున్నీసా బేగం అనే బ్యూటీషియన్ కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు సంత రోడ్డులో నివాసం ఉంటోంది. భర్తతో విడిపోయిన ఆమె సాధిక్ అనే మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
ఇటీవలే సాధిక్ గంజాయి కేసులో అరెస్ట్ అవ్వగా.. అతడిని విజయవాడ జైలుకు తరలించారు. పోలీసులు సాధిక్ ను విచారణ చేయగా.. అతను చెప్పిన వివరాలను బట్టి హలీ మున్నీసా గంజాయి స్మగ్లింగ్ చేస్తుందని తెలిసిందే. దాంతో సాధిక్ ఇచ్చిన అడ్రస్ లో ఉన్న హలీమున్నీసా ఇంటికి వెళ్లి తనిఖీలు చేయగా.. ఆమె ఇంటి గంజాయి లభ్యమైంది. ఫ్రిడ్జ్ లో దాచిన 550 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, హలీమున్నీసాను అరెస్ట్ చేశారు.
Next Story

