నారాయణ, ఆయన బంధువుల ఇళ్లలో కొనసాగుతున్న సీఐడీ సోదాలు

హైదరాబాద్ కొండాపూర్ లోని మాజీ మంత్రి నారాయణ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలపై సీఐడీ..

Update: 2023-02-25 06:35 GMT

AP CID searches in narayana's house

ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో రెండోరోజు ఏపీ సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కొండాపూర్ లోని మాజీ మంత్రి నారాయణ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలపై సీఐడీ అధికారులు శుక్రవారమే క్లారిటీ ఇచ్చారు. రాజధాని మాస్టర్ ప్లాన్ అవకతవకలపైనే సోదాలు చేస్తున్నట్లు తెలిపారు. నారాయణ నివాసంతో పాటు.. కూకట్ పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్ లో ఉన్న నారాయణ కుటుంబీకుల నివాసాలపై సీఐడీ సోదాలు నిర్వహించాయి. నారాయణ కుటుంబీకుల బ్యాంక్ స్టేట్ మెంట్లను సీఐడీ అధికారులు పరిశీలించారు. పలు లావాదేవీలపై ఆరా తీశారు.

ఏపీ సీఐడీ శుక్రవారం నారాయణ రెండో కూతురి నివాసాల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌, మాదాపూర్, కొండాపూర్ లలో శరణికి ఉన్న నివాసాలపై ఏకకాలంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అమరావతిలో భూముల కొనుగోళ్లకు మనీరూటింగ్ కు పాల్పడినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. మనీరూటింగ్ ద్వారా 146 ఎకరాలను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. సోదాల్లో భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీలన్నింటీపై కొన్ని ఆధారాలు సేకరించినట్లు సమాచారం.



Tags:    

Similar News