పోలీసుల దిగ్బంధనంలో ఏపీ సీఎం నివాసం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపు నిచ్చాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Update: 2022-11-28 04:50 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపు నిచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాల్మీకి, బోయ కులాలను ఎస్టీల్లో చేరిస్తే తమ రిజర్వేషన్లు తగ్గిపోతాయని గిరిజన సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. సీఎం నివాసాన్ని ముట్టడించాలని నిర్ణయించాయి.

గిరిజన సంఘాలు...
దీంతో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం చుట్టూ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నివాసం చుట్టూ పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గాలైన తాడేపల్లి పశువైద్య శాల ఎన్టీఆర్ కట్ట, పాత టోల్ గేట్ కూడలి, ప్రాతూరు అడ్డరోడ్డు, క్రిస్టియన్ పేట కూడళ్లలో పెద్దయెత్తున పోలీసు బలగాలను మొహరించారు. వాహనాలను తనిఖీ చేసిన పిమ్మటే అనుమతిస్తున్నారు. దీంతో పనులకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Tags:    

Similar News