ఎంత నష్టమొచ్చినా.. కష్టంలో ఆదుకుంటాం

ఎప్పడు కరువు వచ్చినా గత ప్రభుత్వం రైతులు ఆదుకున్నది లేదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు

Update: 2022-02-15 07:05 GMT

ఎప్పడు కరువు వచ్చినా గత ప్రభుత్వం రైతులు ఆదుకున్నది లేదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. 2014, 2015లో ఏపీలో కరవు వచ్చినా పంట నష్టం గత ప్రభుత్వం చాలా కాలం వరకూ చెల్లించలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం వెంటనే నష్ట పరిహారాన్ని చెల్లిస్తున్నామని చెప్పారు. 2021 నవంబరులో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ రూపంలో ఇస్తున్నామని జగన్ చెప్పారు.

లబ్దిదారుల ఖాతాల్లో...
ఈ సందర్భంగా లబ్దిదారుల ఖాతాలో జగన్ 534 కోట్ల రూపాయలను జమ చేశారు. దాదాపు 5.17 లక్షల మంది రైతులకు ఈ పరిహారం అందుతుందని జగన్ చెప్పారు. వీటితో పాటు 1,220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్ర సేవా పధకం ద్వారా 29.51 కోట్లు జమచేస్తున్నామని చెప్పారు. వర్షాలతో జలాశయాలు కళకళలాడుతున్నాయని, వరదల వల్ల కొంత నష్టం జరిగిందని జగన్ చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పథకాలను మాత్రం ఆపడం లేదన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు.


Tags:    

Similar News