అప్పుడే ఎన్నికలకు వెళతా : జగన్

తెలుగుదేశం పార్టీ పాలనలో కేవలం 39 లక్షల మందికి వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ గా ఇచ్చేవారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు

Update: 2023-03-15 12:35 GMT

తెలుగుదేశం పార్టీ పాలనలో కేవలం 39 లక్షల మందికి వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ గా ఇచ్చేవారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. . వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 64 లక్షల మంది గ్రామీణ ప్రాంత ప్రజలు నెలకు రూ.2,750 పెన్షన్ తీసుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఏడాదికి దానిని రూ.3 వేలకు పెంచి.. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్ అసెంబ్లీలో వెల్లడించారు

నా నడక నేలమీదే...
తన నడక నేలమీదే ఉంటుందని, తన ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనేనని అన్నారు. తన యుద్ధం పెత్తందార్లతోనే అని జగన్ స్పష్టం చేశారు. పేదరికం నిర్మూలన మాత్రమే తన ధ్యేయమన్న జగన్ మంచి పనుల చేసి మరోసారి అధికారంలోకి రావాలన్నదే తన లక్ష్యమని జగన్ అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్ష...
అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 23వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో మంత్రికి కొంతమంది ఎమ్మెల్యే లను అటాచ్ చేసి వారిని ఓటింగ్ కు వచ్చేలా చూసే బాధ్యతను మంత్రులకు తీసుకోవాలన్నారు. తమకు కేటాయించిన ఎమ్మెల్యేలు ఓటు వేసేంతవరకూ ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేయాలని ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా పోటీలో ఉండటం తో జగన్ ముందు జాగ్రత్త చర్యగా ఈ ఆదేశాలను మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.


Tags:    

Similar News