జగన్ కు పవన్ 3 ప్రశ్నలు : సమాధానం చెప్పాలంటూ ట్వీట్
ఇటీవలే సీఎం జగన్ పవన్ వాలంటీర్లపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ.. పవన్ వైఖరి సరిగ్గా లేదని మండిపడ్డారు.
pk and cm jagan
ఏపీలో ప్రస్తుతం రాజకీయాలపరంగా ఉన్న హాట్ టాపిక్.. వాలంటీర్లపై పవన్ చేసిన ఆరోపణలు. ఈ విషయమై అధికార వైసీపీ.. జనసేన పార్టీల మధ్య పరస్పర విమర్శలు జరుగుతున్నాయి. ఇటీవలే సీఎం జగన్ పవన్ వాలంటీర్లపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ.. పవన్ వైఖరి సరిగ్గా లేదని మండిపడ్డారు. తాజాగా మరోసారి వాలంటీర్ల అంశాన్ని లేవనెత్తారు పవన్. వాలంటీర్లు సేకరించే ప్రజల వ్యక్తిగత సమాచారంపై మరోసారి పవన్ ట్వీట్ చేశారు. ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
పవన్ సంధించిన ఆ మూడు ప్రశ్నలు ఏంటంటే.. 1. వాలంటీర్లకు బాస్ ఎవరు ? 2. ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు ? 3. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే హక్కు, అధికారం వారికి ఎవరిచ్చారు ? ఈ మూడు ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.