విజయసాయిరెడ్డి బాటలోనే అయోధ్య రామిరెడ్డి?
మరో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది
వైసీపీ రాజ్యసభ సభ్యులు వరసగా రాజీనామాలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో తదుపరి రాజీనామా చేసేవారిపై చర్చ జరుగుతుంది. అయితే మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే అయోధ్య రామిరెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నందున దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
దావోస్ పర్యటనలో...
అయితే విజయసాయిరెడ్డి బాటలోనే అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా బాట పడతారని పెద్దయెత్తున ప్రచారం జరిగింది. ఆయనను సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ పదవీ కాలం వచ్చే ఏడాది వరకూ ఉంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం ఇంకా అందలేదు.