Kakani Govardhan Reddy : కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు నమోదయింది.
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు నమోదయింది. కృష్ణపట్నం పోర్టు వద్ద టోల్ గేట్ పెట్టి అక్రమంగ నగదు వసూలు చేశారన్న ఆరోపణలపై కాకాణి గోవర్థన్ రెడ్డి పై ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే అక్రమంగా మైనింగ్ చేశారని, సర్వే పల్లిలో గ్రావెల్ ను అక్రమంగా తరలించి విక్రయించారంటూ ఆయనపై ఇప్పటికే కేసు నమోదయింది
వరస కేసులు...
ఈ కేసులో కాకాణి గోవర్థన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలతో మూడు రోజుల పాటు ఈ కేసులో విచారించారు. అయితే తాజాగా మరో కేసు కాకాణి గోవర్థన్ రెడ్డి పై నమోదు కావడంతో ఇక వరస కేసులు కాకాణిపై నమోదు అయ్యేటట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాకాణి గోవర్థన్ రెడ్డి మైనింగ్ కేసులో నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.