తురకా కిషోర్ పై మరో కేసు

మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ పై మరో కేసు నమోదయింది

Update: 2025-07-02 07:31 GMT

మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ పై మరో కేసు నమోదయింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న తురకా కిషోర్ పై వరస కేసులు నమోదవుతున్నాయి. దీంతో దాదాపు ఆరు నెలల నుంచి తురకా కిషోర్ జైలులోనే ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్దా వెంకన్నల వాహనంపై దాడి చేసిన కేసులో అరెస్టయిన తురకా కిషోర్ పై వరస కేసులు నమోదు అవుతుండటంతో ఆయన జైల్లోనే ఉంటున్నారు.

ఆరు నెలల నుంచి...
ఆరేళ్ల క్రితం తురకా కిషోర్ తనపై దాడి చేశారని పాశం అమరయ్య రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. తురకా కిషోర్ పై దుర్గి పీఎస్ లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. పీటీ వారెంట్ తో తురకా కిషోర్ ను కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఆరు నెలల నుంచి జైల్లోనే ఉన్న వైసీపీ నేత తురకా కిషోర్ పై మరో కేసు నమోదు కావడంతో ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు.


Tags:    

Similar News