వల్లభనేని వంశీపై మరొక కేసు నమోదు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు అయింది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు అయింది. ఇప్పటికే అనేక కేసులు వంశీపై నమోదయ్యాయి. తాజాగా మరొక కేసు నమోదయింది. ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసుతో పాటు సత్యవర్థన్ ను బెదిరించి, కిడ్నాప్ చేశారంటూ ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మట్టి తవ్వకాలపై...
ఈ నెల 17వ తేదీ వరకూ ఆయనకు రిమాండ్ విధించారు. తాజాగా వల్లభనేని వంశీపై మరొక కేసు నమోదయింది. బ్రహ్మలింగయ్య చెరువు అభివృద్ధి పేరుతో మట్టి తవ్వకాలు చేపట్టినట్టు ఫిర్యాదు పోలీసులకు అందడంతో దీనిపై విచారించిన గన్నవరం పోలీసులు వంశీతో పాటు ఆయన అనుచరులు లక్ష్మణ రావు, రంగా, శేషు, రవి, పరంధామయ్యపై కేసు నమోదు చేశారు.