Breaking : ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అన్నామలై

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అన్నామలైను ఎంపిక చేశారు

Update: 2025-04-22 13:40 GMT

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అన్నామలైను ఎంపిక చేశారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. తమిళనాడుకు చెందిన అన్నామలైను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. అన్నామలైను రాజ్యసభ స్థానానికి ఎంపిక చేయనున్నారు. ఇటీవల వరకూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై వ్యవహరించారు.

కేంద్ర మంత్రివర్గంలో...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షాతో సమావేశమైన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశముంది. ఈ నెల 29వ తేదీన నామినేషన్లకు చివరి తేదీ కావడంతో పాటు వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగుతుండటంతో అన్నామలైను రాజ్యసభకు ఎంపిక చేసి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని బీజేపీ భావిస్తుంది. విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన పదవిలో అన్నామలైను ఎంపిక చేయనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.


Tags:    

Similar News