శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది.

Update: 2025-09-23 02:27 GMT

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది. దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతి ఏడాది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్వహిస్తున్నారు. ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణను ఈరోజు రాత్రికి నిర్వహిస్తారు. ఆలయ సన్నిధిలో ఈరోజు రాత్రి విష్వక్సేనుని పర్యవేక్షణలో రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకూ అంకురార్పణను నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.

రేపు సాయంత్రం నుంచి..
తొలుత ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి పుట్టమన్నును సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. ఇందులో నవధాన్యాలు ఉంచి చేసే క్రతువును శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. రేపు సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణంతో స్వామి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇందుకు అవసరమైన దర్భచాప, తాడును ఊరేగింపుగా ఆలయ సన్నిధికి చేర్చారు. నేటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశముండటంతో అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.


Tags:    

Similar News