240 కోట్లు లాటరీ తగిలింది.. ఈ డబ్బులతో ఏపీ యువకుడు ఏం చేస్తాడో తెలిస్తే?

యూఏఈ లో జరిగిన లాటరీలో ఆంధప్రదేశ్ కు చెందిన అనిల్ కుమార్ ను అదృష్టం వరించింది

Update: 2025-10-29 07:28 GMT

యూఏఈ లో జరిగిన లాటరీలో ఆంధప్రదేశ్ కు చెందిన అనిల్ కుమార్ ను అదృష్టం వరించింది. 240 కోట్ల రూపాయల బంపర్ ప్రైజ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనిల్ కుమార్ గత కొన్నేళ్ల నుంచి యూఏఈలో ఉంటున్నాడు. తల్లి పుట్టినరోజు తేదీని లాటరీ టికెట్ నెంబర్‌గా ఎంచుకున్న అనిల్ కుమార్ అమ్మ వల్లనే తనకు ఈ అదృష్టం లభించిందని చెబుతున్నార. యూఏఈలోని అబుదాబి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న ఏపీకి చెందిన బోళ్ల అనిల్ కుమార్ అనే యువకుడు

లాటరీ టికెట్ల కొనుగోలు అలవాటు.
అందులో భాగంగా ఒక లాటరీ టిక్కెట్ కొనడంతో, ఈ నెల 18వ తేదీన జరిగిన లక్కీ డ్రాలో 1240 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. ఇందులో తన ప్రత్యేకత ఏమీ లేదని, అందరిలాగే లాటరీ టికెట్ కొన్నానని, అందులో చివరి నంబర్లు మా అమ్మ పుట్టిన తేదీ కావడంతోనే తనకు అదృష్టం కలిసి వచ్చిందని అనిల్ కుమార్ తెలిపాడు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో తన తల్లిదండ్రులను అబుదాబి తీసుకువచ్చి ఇక్కడే స్థిరపడతానని, ఒక లగ్జరీ కారు కొంటానని, కొంత డబ్బును చారిటీలకు ఇస్తానని అనిల్ కుమార్ తెలిపాడు. ఇదే లాటరీ ఇండియాలో గెలిస్తే దాదాపు రూ.90 కోట్లు పన్ను చెల్లించాల్సి వచ్చేదని, యూఏఈలో లాటరీపై ఎలాంటి పన్ను లేదని అనిల్ కుమార్ తెలిపాడు.


Tags:    

Similar News