సజ్జలకు మహిళ కమిషన్ నోటీసులు
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఈ నోటీసులు జారీ చేసింది. అమరావతి మహిళలను కించపర్చే విధంగా మాట్లాడినందుకు నోటీసులు ఇచ్చింది.
అమరావతి మహిళలను...
అమరావతి మహిళలను కించపర్చే విధంగా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిని నుంచి వివరణ కోరేందుకు ఏపీ మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది. సజ్జల చేసిన వ్యాఖ్యలు మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో కమిషన్ వెంటనే సదించింది. కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి అరుణ ఎదుట ఈ నెల 18వ తేదీన హాజరై సజ్జల రామకృష్ణారెడ్డి తన వివరణ ఇచ్చుకోవాలి.