Pawan Kalyan : నాగరత్నమ్మకు నూతన వస్త్రాలు బహుకరించిన పవన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు

Update: 2025-12-24 05:55 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు. ఇప్పటం గ్రామానికి చేరుకున్న పవన్ కల్యాణ్ ను అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ నేరుగా నాగరత్నమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఆమెను పరామర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్ల వెడల్పు కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్లారు.

ఇప్పటం గ్రామంలో...
అప్పుడు నాగరత్నమ్మ ఇంటిని కూలిపోవడాన్ని గమనించారు. ఆమెను పరామర్శించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వస్తానని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ఇప్పటం గ్రామానికి చేరుకున్న పవన్ కల్యాణ్ నాగరత్నమ్మను పరామర్శించి ఆమెకు నూతన వస్త్రాలను బహుకరించారు. నాగరత్నమ్మ పవన్ ను ఆలింగనం చేసుకుని తన ప్రేమను వెల్లడించింది. భారీగా అభిమానులు ఇప్పటం గ్రామానికి తరలి రావడంతో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News