ఢిల్లీ పర్యటనలో మంత్రి సత్యకుమార్
ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ పర్యటన కొనసాగుతుంది
ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ పర్యటన కొనసాగుతుంది. నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సత్యకుమార్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈరోజు సత్యకుమార్ కేంద్ర మంత్రులు శివరాజ్‍సింగ్, గిరిరాజ్‍సింగ్, జోయల్ ఓరంను కలసి వినతి పత్రాలను సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వైద్య శాఖకు సంబంధించిన అంశాలను చర్చించనున్నారు.
ధర్మవరం నియోజకవర్గానికి...
వైద్య శాఖలో అవసరమైన నిధుల కేటాయింపులపై కేంద్రమంత్రితో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర సాయం సత్యకుమార్ కోరుతున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో అక్కడే కేంద్ర మంత్రులను కలసి ధర్మవరం నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని కోరనున్నారు.