నేడు హైదరాబాద్ కు మంత్రి నారాయణ బృందం
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ బృందం నేడు హైదరాబాద్ లో పర్యటించనుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ బృందం నేడు హైదరాబాద్ లో పర్యటించనుంది. ఉదయం పదకొండు గంటలకు గాజుల రామారంలో పర్యటించనుంది. అక్కడ ఉన్న ఎంఎస్ఎంఈ పార్కును నారాయణ బృందం సందర్శించి అధ్యయనం చేయనుంది. ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి పార్కును ఏర్పాటు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.
అధికారులతో చర్చించి...
ఈ నేపథ్యంలోనే మంత్రి నారాయణ తన శాఖకు చెందిన అధికారులతో కలసి పర్యటించనున్నారు. అక్కడ అధికారులను కలసి వివరాలను తెలుసుకోనున్నారు. ఈ పార్కు నిర్మాణానికి అయ్యే వ్యయంతో పాటు దాని ప్రయోజనాలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదికను మంత్రి నారాయణ బృందం సమర్పించనున్నట్లు తెలిసింది.