Nara Lokesh : కడప జిల్లాలోనే నేడు లోకేశ్.. జగన్ కూడా
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. కడప జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో నారా లోకేశ్ పాల్గొననున్నారు. రాత్రికి చింతకొమ్మదిన్నె మండలం కొలుములపల్లె గ్రామంలో లోకేశ్ బస చేయనున్నారు. మంగళవారం పెండ్లి మర్రి మండలంలో డిగ్రీ కళాశాలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు.
వివిధ కార్యక్రమాలను...
అనంతరం కొప్పర్తి పారిశ్రామిక వాడలో నారా లోకేశ్ టెక్స్ టైల్ యూనిట్ ను ప్రారంభించనున్నారు. అనంతరం జమాలపల్లెలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో లోకేశ్ సమావేశం కానున్నారు. కార్యకర్తలకు అండగా నిలవాలని నేతలకు చెప్పనున్నారు.నేడు జగన్ కూడా కడప జిల్లాలోనే ఉండటంతో పాటు లోకేశ్ కూడా పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.