Nara Lokesh : నేడు తిరుపతికి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు

Update: 2025-02-19 02:14 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి బయలుదేరి తిరుపతి వెళ్తారు. తిరుపతిలో నారా లోకేష్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9.30 నుండి 12.30 గంటల వరకూ తిరుపతి టిడిపి కార్యాలయంలో ఉత్తమ బూత్, యూనిట్, క్లస్టర్, మండల స్థాయి నాయకులు, ఉత్తమ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు.

షెడ్యూల్ ఇదే...
మధ్యాహ్నం 2.15 నుండి 2.45 గంటల వరకూ ఎస్వీ పద్మావతి మహిళా యూనివర్సిటీ లో నూతనంగా నిర్మించిన మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3గంటల నుండి 3.45 గంటల వరకూ ఎస్వీ పద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం లో పాల్గొంటారు. మధ్యాహ్నం 4.20 గంటల నుంచి 6 గంటల వరకూ ఆశా కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ దేవాలయాల సదస్సు లో పాల్గొంటారు.


Tags:    

Similar News