Nara Lokesh: నేడు గన్నవరానికి లోకేశ్.. అశోక్ లేల్యాండ్ కంపెనీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలంలో ఉన్న మల్లపల్లి ఇండస్ట్రియల్ కారిడార్ లో అశోక్ లేలాండ్ పరిశ్రమను లోకేశ్ ప్రారంభించనున్నారు. ఈ కంపెనీ రాకతో తొలి దశలో పన్నెండు వందల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
వేలాది మందికి...
పరోక్షంగా వేలాది మందికి ఉపాధికి అవకాశం కలుగుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్ లోనూ ఈ కంపెనీ విస్తరించి మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెబుతున్నారు.గన్నవరం పర్యటనకు లోకేశ్ వస్తున్న సందర్భంగా టీడీపీ నేతలు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. భారీ స్వాగతం పలికేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు.