Nara Lokesh : అభిమాని పిలిచె.. పెళ్లికి హాజరయ్యె

ఆంద్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పార్టీ కార్యకర్త వివాహానికి హాజరై అందరినీ ఆశ్చర్య పరిచారు

Update: 2025-10-04 12:09 GMT

ఆంద్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పార్టీ కార్యకర్త, అభిమాని వివాహానికి హాజరై అందరినీ ఆశ్చర్య పరిచారు. తన పెళ్లికి రావాలంటూ పార్టీ కార్యకర్త భవ్య పెండ్లి పత్రికను లోకేశ్ కు పంపగా ఈరోజు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. విజయవాడలో లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర లో విజయవాడ మొగల్రాజపురానికి చెందిన భవానీ అనే యువతి ఉత్సాహంగా పాల్గొని సంఘీభావం తెలిపారు. యువగళం యాత్ర ద్వారా లోకేష్ అభిమానిగా మారిన భవ్య... తన పెళ్లికి విచ్చేసి ఆశీర్వదించాలంటూ ఇటీవల మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానపత్రిక పంపించారు.

మధ్యాహ్నం వారి ఇంటికి వెళ్లి...
శనివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో భవ్య వివాహం జరగనుంది. బిజీ షెడ్యూలు ఉన్నప్పటికీ మంత్రి లోకేష్ శనివారం మధ్యాహ్నం మొగల్రాజపురంలోని తన అభిమాని భవ్య ఇంటికి వెళ్లి ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. అకస్మాత్తుగా అభిమాన నేత లోకేశ్ తమ ఇంటికి రావడంతో భవ్యతోపాటు ఆమె తల్లిదండ్రులు నాగుమోతు రాజా, లక్ష్మి ఆనందంతో పొంగిపోయారు. యువనేత లోకేష్ ను చూసి వారి ఉద్వేగానికి గురయ్యారు. వధూవరులను ఆశీర్వదించి వచ్చారు.


Tags:    

Similar News