Nara Lokesh : చిట్టి తల్లీ.. అంటూ నారా లోకేశ్ ఆ విద్యార్థినికి భరోసా
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఒక విద్యార్థిని చదువును ఆపేసి పనులకు వెళుతుండటం తెలిసి స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఒక విద్యార్థిని చదువును ఆపేసి పనులకు వెళుతుండటం తెలిసి స్పందించారు. నారా లోకేశ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. పత్తిపొలాల్లో కూలీలకు వెళుతున్న జెస్సీ అనే బాలికకు కేజీవీబీలో సీటు వస్తుందని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఆయన ట్వీట్ లో ఏమన్నారంటే " కేజీబీవీలో సీటు రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళుతున్న జెస్సీ కథనం నన్ను కదిలించింది. చదువుకోవాలనే జెస్సీ ఆశను నిలబెడతాను. అధికారులతో మాట్లాడాను. చిట్టి తల్లీ! కేజీబీవీలో నీకు సీటు వస్తుంది. నిశ్చింతగా చదువుకో" అంటూ ట్వీట్ చేశారు.
తల్లికి వందనం పథకం కింద...
" పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరం. మీరు పిల్లలను బడికి పంపితే తల్లికి వందనం వస్తుంది. చక్కనైన యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్టు ఇస్తున్నాం. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. మనబడిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత మాది. పిల్లల భద్రత -భవితకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం లేదు. విద్యకు పిల్లలను దూరం చేయొద్దని తల్లిదండ్రులను వేడుకుంటున్నాను" అంటూ నారా లోకేష్ ట్వీటీ చేశారు.