Nara Lokesh : తెలంగాణతో సంబంధాలపై లోకేశ్ ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మరోసారి రెడ్ బుక్ పై తన అభిప్రాయాన్నితెలిపారు

Update: 2025-07-05 03:04 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మరోసారి రెడ్ బుక్ పై తన అభిప్రాయాన్నితెలిపారు. రెడ్ బుక్ ఆధారంగా అక్రమార్కులపై చర్యలు తప్పవని నారా లోకేశ్ హెచ్చరించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చట్టాలను అతిక్రమించి తప్పులు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని తెలిపారు.

మోదీయే స్ఫూర్తి...
రాజకీయాల్లో మోదీయే నాకు స్ఫూర్తి అన్న యువనేత నారా లోకేశ్ రూపాయికే కాగ్నిజెంట్‌కు 21 ఎకరాల భూమి కేటాయించామని, 99 పైసలకే టీసీఎస్‌కు స్థలం ఇచ్చామని దీనివల్ల భారీగా ఉద్యోగాలు రానున్నాయని నారా లోకేశ్ తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలు తిరస్కరించారన్న నారా లోకేశ్ తెలంగాణతో సఖ్యతకే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.


Tags:    

Similar News