Nara Lokesh : రేవంత్ రెడ్డి పై లోకేశ్ సంచలన కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సంచలన కామెంట్స్ చేశారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి కావాలా? అని మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. తాను కేటీఆర్ ను కలవడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ మాట్లాడిన లోకేశ్ తెలంగాణలో ఎవరిని కలవాలన్నదానిపై రేవంత్ రెడ్డి అనుమతి తీసుకోవాల్సిన పనిలేదని చెప్పారు. అది తమ పార్టీకి సంబంధించిన విషయమని అన్నారు.
కవితను టీడీపీలో చేర్చుకోవడమంటే...
వైఎస్ జగన్ బీజేపీ కి ఎందుకు మద్దతిచ్చారో ఆయననే అడగాలని ఒక ప్రశ్నకు సమాధానంగా లోకేశ్ చెప్పారు. రెడ్ బుక్ లో అనేక స్కామ్ ల వివరాలున్నాయని, జగన్ అందుకే భయపడి బెంగళూరులో ఉంటున్నారని లోకేశ్ అన్నారు. కవితను టీడీపీలో చేర్చుకుంటే జగన్ ను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నట్లేనని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్నది త్వరలోనే చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్న లోకేశ్, తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడం లక్ష్యంగానే పనిచేస్తామని అన్నారు.