Nara Lokesh : నేడు నెల్లూరులో నారా లోకేశ్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు

Update: 2025-07-07 03:38 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి నెల్లూరుకు చేరుకున్న లోకేశ్ నేడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నెల్లూరు సిటీలో వీఆర్ మున్సిపల్ హైస్కూల్ ను లోకేశ్ ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం పదకొండు గంటలకు నెల్లూరు సిటీ నియోజకవర్గ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

పార్టీ కార్యకర్తల సమావేశంలో...
మధ్యాహ్నం పన్నెండు గంటలకు నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. నేతలు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని, కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరనున్నారు. సాయంత్రం నెల్లూరు నగరంలో బారాషహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ కార్యక్రమంలో పాల్గొంటారు. రొట్టెలను సమర్పిస్తారు.


Tags:    

Similar News